అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 22-2
సంపుటము: 4-541
నిడు రేకు: 22-2
సంపుటము: 4-541
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| కాయముల కాణాచి కాఁపులము చాయల మా సుఖము జయమేఁటిదయ్యా | ॥పల్లవి॥ |
| పంచ మహా పాతకాల బైరు విత్తి దేహాల కంచపుఁ గొలుచులుగా గాదెలఁబోసి చంచలాలు జవ్వనాలు చవులైన కూరలుగా నించి భుజియించే మానిజమేఁటిదయ్యా | ॥కాయ॥ |
| ఉడివోని లంపటాన నూళ్ళుఁ బల్లెలు నెక్కి యిడుమల మమతల నిండ్లు గట్టి గొడవలానానసల కూరిమి సంపదల పొడవైన మామతి పొందేఁటిదయ్యా | ॥కాయ॥ |
| పనిలేని మమతల్ల పాపములు బందాలు గొనకొని ధనములు గూడపెట్టి కని నేఁడు తిరు వేంకటపతి కృపతోడ తనియని మాతోడి తగువేఁటిదయ్యా | ॥కాయ॥ |


