అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 22-4
సంపుటము: 4-543
నిడు రేకు: 22-4
సంపుటము: 4-543
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎన్నటి కెవ్వరి కితఁడే అన్నిటానున్న అధికుఁడు | ॥పల్లవి॥ |
| ఆతుమ కంతర్యామీ స్వామీ యేతరినైనా నితఁడే పాతక శూరుఁడు పారశరీరుఁడు పూతన ప్రాణ ఘాతకుఁడు | ॥ఎన్న॥ |
| అక్కర దీరచ నందాఁ జెందా యెక్కడనైనా నితఁడే పుక్కిటి లోకాలు పొందుగా నించి మా దిక్కైనా పరదేవుఁడు | ॥ఎన్న॥ |
| నేరమి నేరుపు నించాఁ బెంచా నేరీతినైనా నితఁడే కారుణ్యనిధి వేంకట విభుఁడు మా చేరువై యున్న చెలువుఁడు | ॥ఎన్న॥ |


