అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 46-1
సంపుటము: 4-558
నిడు రేకు: 46-1
సంపుటము: 4-558
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| చాలదా నా సంసారము గాలి యుయ్యెలలఁ దొలఁగక యూఁగవలసె | ॥పల్లవి॥ |
| పాపపుణ్యములనెడి బల్లిదుల వెంటనే దీపించు బంటనై తిరిగి తిరిగి పైపైనె దేహంపుఁ బల్లెలొసఁగిన నరక కూపముల మడి దున్నుకొని బ్రదుకవలసె | ॥చాల॥ |
| చిత్తమను విభుఁజేరి చెలఁగి విషయంబులకు కొత్తగమికాఁడనై కొలిచి కొలిచి హత్తుకొని మోహంబులను ప్రధానుల యెదుట గత్తంపు మొగసాలఁ గలదించవలసె | ॥చాల॥ |
| గాటంపు దురితములకై జీతగాఁడనై చేటైన కోరికలఁ జేరిచేరి ఈటాడఁ దిరు వేంకటేశుఁ గనకిన్నాళ్ళు కోటకొమ్మలకెగసి గుంపించవలసె | ॥చాల॥ |


