Display:
అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 50-1
సంపుటము: 4-564
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
త్వమేవ శరణం త్వమేవ శరణం
కమలోదర శ్రీజగన్నాథా
॥పల్లవి॥
వాసుదేవ కృష్ణ వామన నరసింహ
శ్రీ సతీశ సరసిజ నేత్ర
భూసురవల్లభ పురుషోత్తమ పీత
కౌశేయవసన జగన్నాథా
॥త్వమే॥
బలభద్రానుజ పరమపురుష దుగ్ధ
జలధివిహార కుంజరవరద
సులభ సుభద్రా సుముఖ సురేశ్వర
కలి దోష హరణ జగన్నాథా
॥త్వమే॥
వటపత్ర శయన భువనపాలన జంతు
ఘటకార కరుణ శృంగారాధిప
పటుతర నిత్య వైభవ రాయ తిరువేం
కటగిరినిలయ జగన్నాథా
॥త్వమే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము