అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 74-1
సంపుటము: 4-574
నిడు రేకు: 74-1
సంపుటము: 4-574
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| భవములు వీడఁగఁ బాలించి చవి మరపెను మోక్షము తెరువు | ॥పల్లవి॥ |
| కర్మకోట్లకు గడిచీటిచ్చెను నిర్మలమతులకు నేఁడిపుడే ధర్మమార్గమునఁ దడవి నడచుటకు నర్మిలిఁ బుణ్యములందుటకు | ॥భవ॥ |
| ముంజేతద్దము మూలదాముగా సంజీవని సరసత నొసఁగె గొంజ సుకృతములు కుమ్మరించి హరి రంజించెను సర్వజనులకు | ॥భవ॥ |
| పట్టముగట్టెను ప్రాణులకెల్లను గట్టిగఁ దిరు వేంకట విభుఁడు ఒట్టిన యాపదలూడఁదోలి జను లిట్టే నిజసుఖమిచ్చుటకు | ॥భవ॥ |


