Display:
అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 74-2
సంపుటము: 4-575
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
నన్ను నింత సేయుకంటె నవ్వులున్నవా పంట
మన్ను పైఁడిముద్ద గాఁగ మన్నుపూసె (?) నితఁడు
॥పల్లవి॥
పంచమహాపాతకులఁ బరమపావనులఁగా
వించఁ బూనె నిందుకంటె విద్యలున్నవా
ఇంచుకంత హరినామమింతలోననె ముట్టు
పెంచు దెచ్చి మాణికపుబిల్ల సేసె నితఁడు
॥నన్ను॥
మాలవాని కష్టవిద్య మందవెట్టి బ్రహ్మవిద్య
పాలుసేసె నిందుకంటె బ్రతుకున్నదా
నాలుకందునున్న విష్ణునామమంత్రము చెప్పు
తోలుబిల్ల మాడకంటె దొడ్డసేసె నన్నును
॥నన్ను॥
కుక్క దెచ్చి గంగిగోవు కొదమగాఁగ భూమిలోన
ఒక్కమాట యింతసేయ నోపవచ్చునా
దిక్కులందు వేంకటేశు దివ్యనామము రోఁత
కక్కుఁగూటి నమృతజలధిఁ గావించె నన్నును
॥నన్ను॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము