అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 75-2
సంపుటము: 4-579
నిడు రేకు: 75-2
సంపుటము: 4-579
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ?---
| నీ కథామృతము నా నిరతసేవన నాకు చేకొనుట సకలసుఖసేవనంబటు గాన | ॥పల్లవి॥ |
| ఇదియె మంత్రరాజము నాకు నేప్రొద్దు నిదియె వేదసంహిత పాఠము ఇదియె బహుశాస్త్రమెల్లఁ జదువుట నాకు ఇదియె సంధ్య నాకిదియె జపమటు గాన | ॥నీక॥ |
| ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు ఇదియె దుఃఖవిరహితమార్గము ఇదియె బహులోకహితభేషజము నాకు ఇదియె వుపనిషద్వాక్యపద్ధతిగాన | ॥నీక॥ |
| ఇదియె దానఫలమియ్యఁ జాలును నాకు ఇదియె తపవిరహిత కర్మము ఇదియె తిరువేంకటేశ్వరుని సంస్మరణ ఇదియె యిదియె యిన్నియును నటుగాన | ॥నీక॥ |


