అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 80-3
సంపుటము: 4-583
నిడు రేకు: 80-3
సంపుటము: 4-583
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఓపనయ్య వోపనయ్య ఓపనయ్య యీ యొప్పులే తప్పులు | ॥పల్లవి॥ |
| ఎక్కడికి నెక్కడ - యెక్కువే యెరవు తక్కులే యీ మొక్కులు - తక్కువే దారణ | ॥ఓప॥ |
| ఎవ్వరికి నెవ్వరో నవ్వులే నొవ్వులు తవ్వలే యీరవ్వలు - చివ్వలే సిగ్గులు | ॥ఒప॥ |
| బొంకులే పొందులు - కింకలే గిరులు వేంకటవిభుఁడ నీ - జంకెలే జంపులు | ॥ఓప॥ |


