అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 82-2
సంపుటము: 4-585
నిడు రేకు: 82-2
సంపుటము: 4-585
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| హితమిదియే కాకిఁక లేదు - మా గతిఁ జెరి (?) నీకృపె కలదిది యెల్లా | ॥పల్లవి॥ |
| పాతకకోట్లం బాయునుపాయం బేతరిఁ జూచిన నిఁక లేదు చైతన్యాత్మక సకలేశ్వర నీ చేతిదె ప్రాణుల జీవనమెల్లా | ॥హిత॥ |
| భవబంధంబులఁ బాయునుపాయం బివల నవల మారికిఁక లేదు ధ్రువవరదుఁడ కౌస్తుభధర నీకృప చవిచేతివె మా సంపద లెల్ల | ॥హిత॥ |
| పరమ పదం బగపడు విభవము నీ కరుణే కానిఁకఁ గడలేదు తిరు వేంకటగిరి దేవుఁడ నీకే భరము జంతువుల పనులివి యెల్లా | ॥హిత॥ |


