అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 84-1
సంపుటము: 4-587
నిడు రేకు: 84-1
సంపుటము: 4-587
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| ఈ జీవునకు నేది గడపల తనకు నే జాతియును లేక యిట్లున్నవాఁడు | ॥పల్లవి॥ |
| బహుదేహ కవచములఁ బారవేసినవాఁడు బహుస్వతంత్రముల నాపద నొందినాఁడు బహుకాలముల మింగి పరవశంబైనాఁడు బహుయోనికూపములఁ బడి వెడలినాఁడు | ॥ఈజీ॥ |
| పెక్కుబాసలు నేర్చి పెంపు మిగిలినవాఁడు పెక్కు నామములచే బిలువఁబడినాఁడు పెక్కుకాంతలతోడ పెక్కుపురుషులతోడ పెక్కులాగులఁ బెనఁగి బెండుపడినాఁడు | ॥ఈజీ॥ |
| ఉండనెన్నఁడుఁ దనకు ఊరటెన్నఁడు లేక యెండలకు నీడలకు యెడతాఁకినాఁడు కొండలలో నెలకొన్న కోనేటిరాయని యండ చేరెదననుచు నాసపడినాఁడు | ॥ఈజీ॥ |


