శృంగార సంకీర్తన
రేకు: 1-5
సంపుటము: 5-5
రేకు: 1-5
సంపుటము: 5-5
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| రాకుంటే మానుఁగాక రంతులేఁటికే వేఁకపు గుబ్బలాండ్ల విటుడాఁతఁడు | ॥పల్లవి॥ |
| అంపిన కప్పురమొల్ల నంటేఁ దాననుఁ గాక వంపు మోముతోడ నీకు వాడనేఁటికే చెంపల లప్పలు నిండఁ జెరిగిన కప్పురపు - గంపకొప్పుల సతుల ఘనుఁడాతడు | ॥రాకుం॥ |
| ఒద్దికగాకక్కడనే వుంటే దానుండుఁ గాక ముద్దుమోము వంచి నీకు మొక్కనేఁటికే చద్దికి వేఁడికి మంచిచక్క సతుల మోవి పొద్దునొద్దుకారగించే భోగి యాతఁడు | ॥రాకుం॥ |
| అబ్బురపు వేంకటేశుఁడైతే దానవుఁ గాక గబ్బి చూపులెల్లా నీకై గప్పనేఁటికే జొబ్బిలేటి జవ్వాదిసోనల పన్నీట నన్ను గుబ్బలంటి సరసానఁ గూడెనాతఁడు | ॥రాకుం॥ |


