శృంగార సంకీర్తన
రేకు: 2-3
సంపుటము: 5-8
రేకు: 2-3
సంపుటము: 5-8
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| కోపములిద్దరిలో గోరగించీఁ జూడరే పైపైనె జవరాలు పంపెడి నింతులను | ॥పల్లవి॥ |
| అమ్మ విలువఁగనంపె నాతని రమ్మనరే దిమ్మరై వీదులవెంట దిరిగీనని కమ్మరఁ గమ్మరనేల కలహమిద్దరిలో దుమ్ములుగాఁ గస్తూరి ధూళి లేచె మేనులు | ॥కోప॥ |
| దేవులమ్మ నిలిచీన దేవుని రమ్మనరే ఆవలనెవ్వతెకు లోనాయెనో యని తావుల బుగులడిచి తను వెల్లానిదివో లావాయ జగడాలు లలనకుఁ దనకు | ॥కోప॥ |
| లకిమమ్మ కేమైనా లంచము లిమ్మనరో శుకవాణి తలపు మూసుక తియ్యదు వెకలియై సతిఁగూడె వేంకటేశ్వరుఁడు ఒకరొకరికి లోలో నొద్దికలు ఘనము | ॥కోప॥ |


