Display:
శృంగార సంకీర్తన
రేకు: 2-5
సంపుటము: 5-10
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇంత మమ్మిట్లా నెలయించకురా నీ-
పంతములన్నియుఁ బారఁ బట్టింతునోరి
॥పల్లవి॥
అతిరాజసపు మాటలాడకురా యే-
కతమైన నాచేతఁ గడు నొత్తువోరి
ఇతరులవలె నన్ను నెంచకురా నీఁ
మతి చొచ్చి నీమేను మఱపింతునోరి
॥ఇంత॥
చెలఁగుచు గుంపెనలు సేయకురా నీ-
సిలుగు మాటల నిన్నుఁ జిక్కింతునోరి
చలివలపులు మాపైఁ జల్లకురా యీ-
కులుకు గోళ్ళ నిన్ను గుంపింతు -నోరి
॥ఇంత॥
జంకెనచూపులఁ బగ చాటకురా నే-
నింక నిన్నుఁ బోనియ్య నెంతైన నోరి
లంకెల నీ పొందులు దలఁచకురా తిరు-
వెంకటేశ నానేరుపు వెచ్చింతునోరి
॥ఇంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము