శృంగార సంకీర్తన
రేకు: 2-6
సంపుటము: 5-11
రేకు: 2-6
సంపుటము: 5-11
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇచ్చకాలు నాకు నీకు నిఁక నేలరా నీ- యచ్చపుఁ గోరిక నాతో నానతీరా వోరి | ॥పల్లవి॥ |
| అమ్మితి నామేను నీకు నప్పుడె వోరి చూపుఁ- జిమ్ముల నేఁచకేమైనాఁ జిత్తగించరా అమ్మకచెల్ల నే నీకు నడ్డమా వోరి యింపు గుమ్మరింపుచు నాగుట్టు కొల్లగొంటివోరి | ॥ఇచ్చ॥ |
| జట్టి గొంటివిదె నన్ను జాలదా వోరి యీ- చిట్టంట్ల నీవేఁచక చిత్తగించరా ఎట్టైనా నేనీకింత యెదురా వోరి నీ- పట్టిన చలమే చెల్లె బాపురా వోరి | ॥ఇచ్చ॥ |
| వేసాల వేంకటగిరివిభుఁడా నేఁడోరి నీ- సేసిన మన్ననలిట్టె చిత్తగించరా వాసన కస్తూరిమేని వన్నెకాఁడ నీ- యాసల మేకులే దక్కెనద్దిరా వోరి | ॥ఇచ్చ॥ |


