శృంగార సంకీర్తన
రేకు: 3-1
సంపుటము: 5-12
రేకు: 3-1
సంపుటము: 5-12
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| మగువ వూర్పులనైన మనుఁగా చలిగాలి నిగుడుఁగా జగమెల్ల నిండఁ దనరూపు | ॥పల్లవి॥ |
| అతివవదనము వాడ నలరి చందురుఁడైన బ్రతుకుఁగా వొకకొంత బయలుమెరసి సతి యెలుఁగు రాయ విరసపు బికావళియైన తతిఁ జెలఁగుఁగా నేడు తమకెదురు లేక | ॥మగు॥ |
| తెఱవ వేనలి చెదర తేఁటి మొత్తములైన మెఱయుఁగా వొకకొంత మేలుగలిగి ఒఱగి యలసతతోడ నువిద కనుమోడ్పుగా నెఱిఁ గలువలలరుఁగా నేఁటిమాపైన | ॥మగు॥ |
| తరుణి దేహము నాటి దర్పకుని శరమైన పరిమళము నిండుగా బహువిధమున కరిగమననిపుడు వేంకటవిభుఁడు కౌగిటను కరుణించ లతలైనఁ గాంచుఁగా తెలివి | ॥మగు॥ |


