Display:
శృంగార సంకీర్తన
రేకు: 3-3
సంపుటము: 5-14
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
రాగఁదే చూతఁడిదె రసికుఁడగు కెలవాడి-
కౌఁగిటి రమణితోడ కనకగిరి వాని
॥పల్లవి॥
అదిగదె వసంతంబులాడీఁ గూడి
కదలుఁగనుఁ గవల చక్కని సతులతో
వెదకి పై కుంకుములు వేసీ రాసి
వుదుటుచనుదోయిపై నొదిగి వొదిగి
॥రాగ॥
కడుఁ బేర్చి నేతికడవల గుబ్బెతలఁ జేరి
అడుగడుగునకు నాటలాడి
నడిమి సన్నపుసిరుల నగవు రెప్పల గరుల
తొడికి చెనకీనదివొ దొరదైవము
॥రాగ॥
దప్పి దేరంగ సైఁదపుగుడుములును వడలుఁ
బప్పులునుఁ బన్నీటి పానకములు
అప్పఁడగు కెలవాడి అదె కనకరాయఁడై
కప్పురము చల్లి చక్కని సతులపైని
॥రాగ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము