శృంగార సంకీర్తన
రేకు: 3-4
సంపుటము: 5-15
రేకు: 3-4
సంపుటము: 5-15
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| సి(చి)న్న వాఁడవని నమ్మ సెల్లదు నిన్ను సిన్నైన యాటదెల్ల సిక్కుసీరై పోయను | ॥పల్లవి॥ |
| అవుర బాలకిసునరాయఁడ నీవు సంటిపాలు నవులంటా నెత్తురెల్ల సప్పరించఁగా కవకవ నవ్వినవ్వి కన్నులు దేలగిలఁగ సవరన్ని యాటదెల్ల నప్పుసారై పోయను | ॥సిన్న॥ |
| రారా గోపాలకిసునరాయ నీవదె గొల్ల- వారి మగువల సూపు వల్లె వేయఁగా సూరఁబోయే రేపల్లె సొక్కని గుబ్బెతల- సేరలంతల కన్నుల సిన్ని సిన్ని సిగ్గులు | ॥సిన్న॥ |
| కిన్నెర వెంకటగిరి కిసునరాయఁడ నీవు వన్నెలుగ వీది వీది వాయించఁగా మిన్నుదాఁకి లోకానకు మేఁటియైన లకిమమ్మ నిన్ను సేరి సరుగన నిలుసుండే సొక్కెను | ॥సిన్న॥ |


