శృంగార సంకీర్తన
రేకు: 3-5
సంపుటము: 5-16
రేకు: 3-5
సంపుటము: 5-16
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| పొద్దు వొద్దుకును వలపుల నేఁచేవు వద్దు బుద్దిగాదు నీకు నేఁప భువనమోహినిని | ॥పల్లవి॥ |
| అప్పుడు మా విన్నపము లాలకించఁ బొద్దులేక యిప్పుడు విచ్చేసినాఁడవిఁక నైనాను చెప్పరాని విన్నియును చిత్తగించి చూతు గాని చప్పర మంచములోని చక్కని కోమలిని | ॥పొద్దు॥ |
| అలసి మాతోడ మాటలానతియ్య వేళగాక యెలయించ వచ్చినాఁడ వింతలోననే సొలపు మాటలు గావు చూడు నీవే మేడమీఁద చెలులపైనొరగిని జిగి గుబ్బలాఁడిని | ॥పొద్దు॥ |
| వేఁగెడి రమణిఁ జూచి వేగినంతకు రావైతి మాఁగెఁగా యింతట నీ మనసైనాను వేఁగు వచ్చెనా నీకు వేంకటేశ కృపఁజూడు కాఁగిట నవధరించు కన్నుల కలికిని | ॥పొద్దు॥ |


