శృంగార సంకీర్తన
రేకు: 4-3
సంపుటము: 5-20
రేకు: 4-3
సంపుటము: 5-20
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఇంతే విన్నపమింతేలా నీ- పంతము చేకొంటి పాలించు | ॥పల్లవి॥ |
| అలయు సొలయునతివ లోలోనే చెలిపై నొరగు చెక్కు నొక్కు పులకించు నించు వొలఁతి చెమట చిలికించు గోరఁజిత్తగించు | ॥ఇంతే॥ |
| చెలుల మొరఁగు చింతచే గరఁగు పలుకఁ దలఁచు బడలును పిలుచు నిన్ను నీపేరుకొనుచును తొలఁకు కన్నీరు దుడుచును | ॥ఇంతే॥ |
| చనుఁగవ చూచు సారె నీసేఁతలు తనలోనే మెచ్చి తనరును అనయము వేంకటాధీశ యీ యింతిఁ జెనకి కౌఁగిటఁ జేకొంటివి | ॥ఇంతే॥ |


