శృంగార సంకీర్తన
రేకు: 4-6
సంపుటము: 5-23
రేకు: 4-6
సంపుటము: 5-23
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| వనితభాగ్యంబు దేవరచిత్తము - మాకు బనిగాదు యింక నీ పాదంబులాన | ॥పల్లవి॥ |
| అడబాలసతి బోనమారగించు మటంచు బడి బడిని కడు విన్నపము సేయఁగా ఉడుగని పరాకుతో నుండి నెచ్చెలి మీఁద బడలి వొరగినది నీ పాదంబులాన | ॥వనిత॥ |
| అడపంబుపతి వీడెమవధరింపుమటంచు అడరి కప్పురపుఁ బలుకందీయఁగా కడకంటఁ జూడదిదె కాఁతాళమో మరపొ పడఁతి యిప్పుడు నీ పాదంబులాన | ॥వనిత॥ |
| ఆలవట్టము విసరు అతివలను వలదనదు పాలిండ్లపై కొంగు పచరించదు యేలాగవునొ వేంకటేశ నీవిపుడిట్టె పాలించకున్న నీ పాదంబులాన | ॥వనిత॥ |


