శృంగార సంకీర్తన
రేకు: 4-8
సంపుటము: 5-25
రేకు: 4-8
సంపుటము: 5-25
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశి
| వలపారగించవమ్మ వనిత నీ- యలుక చిత్తమున కాఁకలి సేసినది | ॥పల్లవి॥ |
| అడియాసలనె పక్వమైన సోయగపు- వెడయలుకల మంచి వేఁడి వేఁడి రుచులు ఎడసేసి తాలిమి నెడయించి పైపైనె పొడమిన తమకంపు బోనము వెట్టినది | ॥వల॥ |
| ఆమంచి మధురంపు ఆధరామృతముల వేమారుఁ దావులు చల్లు వెన్నెలబయటను కొమలపుఁ దరితీపు కోరికఁ గుమ్మరించి భామకు పూబానుపు పళ్ళెము వెట్టినది | ॥వల॥ |
| కన్నుల కాంక్షలనెడి కళవళములు దీరె సన్నపు నవ్వులనెడి చనవగ్గలించెను అన్నువపు మరపు నీ కంతవింతఁ గలిగె నేఁ- డిన్నియును దిరువేంకటేశుని మన్ననలు | ॥వల॥ |


