శృంగార సంకీర్తన
రేకు: 5-1
సంపుటము: 5-26
రేకు: 5-1
సంపుటము: 5-26
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| అప్పటి యెండ చెమటలట్టే వుండీనా నెప్పు దప్ప బొంకేవు నే నెఱంగనా | ॥పల్లవి॥ |
| ఆవులఁ గాచిన నాటి యడవికంపల జీర- లావల నేఁడు మాయక అట్టే వుండీనా యేవంక నెవ్వతో నిన్ను నెనసి చేసిన చేఁత నీ వెంత మొఱఁగిన నే నెఱంగనా | ॥అప్పటి॥ |
| వెన్నలు ముచ్చిలునాఁడు వేడి పాలారగించిన అన్నువ నీమోవిపొక్కులట్టే వుండీనా వన్నెకాడ యెవ్వతెకో వలలఁ జిక్కిన నీ- నిన్న మొన్నటి సుద్దులు నే నెఱంగనా | ॥అప్పటి॥ |
| రంగుగ మధురలోని రమణి మెత్తిన నాటి- అంగడి గందపుఁ బూఁతలట్టే వుండీనా చెంగట మొఱగి కలసితివి వేంకటరాయ నింగి మోచిన చేఁతలు నే నెఱంగనా | ॥అప్పటి॥ |


