శృంగార సంకీర్తన
రేకు: 5-2
సంపుటము: 5-27
రేకు: 5-2
సంపుటము: 5-27
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| పోనీ పోనీలే నీ పొందులేఁటికి నీ- యాననము చెమరించె నయ్యో నీ యలుకా | ॥పల్లవి॥ |
| ఆన వెట్టఁగా విచ్చే సేవమ్మపాదాల మీఁదనే కానీ కానీలే యెక్కడికో నీవు మానవతితో బింకాలు మానవా యింకాను నీ- మేనెల్లా బడలెను యేమిటికి నీ యలుక | ॥పోనీ॥ |
| బంగారు దుప్పటికొంగు పట్టఁగానే పెనఁగేవు అంగడి వీధిలో నవులే నీవు రంగైన సతికోపమెరఁగవా యింకాను నీ- తొంగలి రెప్పల నీటఁ దోఁచీలే నీ యలుక | ॥పోనీ॥ |
| తెరవ నిన్నరగంటఁ దిట్టఁగానే బిగిసేవు మఱపుఁ దెలివితో మఱియు నీవు కరఁగి కూడితివి వేంకటగిరి మీఁద నున్న- నెరజాణ విట్టలుఁడ నేఁడుగా నీ యలుక | ॥పోనీ॥ |


