శృంగార సంకీర్తన
రేకు: 5-3
సంపుటము: 5-28
రేకు: 5-3
సంపుటము: 5-28
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎక్కడ నున్నదో చిత్తమేమి దలఁచెనో యింతి చెక్కులెల్లాఁ జెమరించీఁ జెప్పరమ్మా చెలులు | ॥పల్లవి॥ |
| ఆతని సుద్దులు చెప్పే అతివలే చుట్టాలు అతనిని వద్దనిన వారందరుఁ బగ రాతిరెల్లా నిద్దు రెరఁగదు పాదములొత్తి చేతులెల్లఁ బొక్కెనేమి సేతమమ్మా చెలులు | ॥ఎక్కడ॥ |
| నవ్వులు చెక్కులకు గన్నపుగండిదొంగలాయ నొవ్వులాయ జూపులు కన్నుల మీఁదికి దవ్వులాయఁ బయ్యద గందపు గుబ్బల మీఁదికి యెవ్వరి నొల్లదు యిఁకనేఁటికమ్మా చెలులు | ॥ఎక్కడ॥ |
| చిత్తమెల్లా దక్కఁగొనె సిగ్గులు ముంగిట వేసె వత్తివలె దేహమెల్లా వాడఁబారెను కత్తిఁ గోసినట్లు వేంకటపతి ఘాతలకు జొత్తు పాపవలె నాయఁ జూడరమ్మా చెలులు | ॥ఎక్కడ॥ |


