శృంగార సంకీర్తన
రేకు: 5-5
సంపుటము: 5-30
రేకు: 5-5
సంపుటము: 5-30
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| మీలో మీలో మేలే పెంచిన- తాలిమి కూటమి దలఁచినను | ॥పల్లవి॥ |
| ఆరడిఁ బెట్టిన అలుకలు ముట్టిన- కూరిమి మచ్చిక గూరిచిన బీరాన మీలో ప్రేమమే పెంచిన- నేరుపు మీలో నించినను | ॥మీలో॥ |
| చనవులిచ్చినఁ జదురులెచ్చిన- కొనచూపులు లోఁగొచ్చినను అనుగు మోహములచ్చినఁ దెచ్చిన- వినికి మనికి వెచ్చినను | ॥మీలో॥ |
| ప్రియములింపులు బిరుదుకెక్కిన - నయము మీలో నాఁటినను జయమై వేంకటాచల రమణుఁడ ప్రియురాలు మీలో బెరసెను | ॥మీలో॥ |


