శృంగార సంకీర్తన
రేకు: 6-2
సంపుటము: 5-33
రేకు: 6-2
సంపుటము: 5-33
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఎక్కడికినెక్కడ యేడకునేడ నే- నొక్కతె నాతనికటరో సతులు | ॥పల్లవి॥ |
| ఆయఁబోయ నాఁడె నాకు నాతనికి నేమివోదు రాయిడి యీచేఁతలకు రాయఁడితఁడు పాయమెల్లా జట్టిగొనె పచ్చిగా నన్నింత సేసెఁ నోయమ్మ తడవకురో యీరోఁతలు | ॥ఎక్కడి॥ |
| చెప్పకు చెప్పకు నాకు సిగ్గయ్యీనిఁకనేల నొప్పి సేసె నాతఁడింత నొచ్చితి నేను కప్పినఁ బోవు సేఁతలు కాలినపుండ్లలోన- నుప్పులు చల్లక తలరో సతులు | ॥ఎక్కడి॥ |
| చాలుఁ జాలు నేల నాఁడే చవిగొన్న కూరలకు మేలుఁ గీడుఁ గొనియాడ మీఁద మీఁదను జాలిఁబెట్టి వేంకటేశ్వరుఁడు నన్నిదె రతి- నోలలాడిండెను చూడరో పొందులు | ॥ఎక్కడి॥ |


