అధ్యాత్మ సంకీర్తన
రేకు: 36-7
సంపుటము: 1-226
రేకు: 36-7
సంపుటము: 1-226
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు కడలేని మనసునకుఁ గడమ యెక్కడిది | ॥కడలు॥ |
| దాహమణఁగిన వెనుక తత్వమెరిఁగెదనన్న దాహమేలణఁగు తా తత్వ మే మెరుఁగు దేహంబుగల యన్ని దినములకుఁ బదార్థ- మోహమేలుడుగు దా ముదమేల కలుగు | ॥కడలు॥ |
| ముంద రెరిఁగిన వెనుక మొదలు మరచెదనన్న ముంద రేమెరుఁగుఁ దా మొదలేల మరచు అందముగఁ దిరువేంకటాద్రీశు మన్ననల కందువెరిఁగిన మేలు కలనైన లేదు | ॥కడలు॥ |


