శృంగార సంకీర్తన
రేకు: 7-1
సంపుటము: 5-38
రేకు: 7-1
సంపుటము: 5-38
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
| తన్నుఁ బాసి నేనింత దంటనట యీ వెన్నెలబాయిట రేయి వేగుఁటింత చాలదా | ॥పల్లవి॥ |
| ఇంటికి రాకుమని నేనంటినట చూడవే అంటఁగాక వున్న దాన నంటినో యేమో కంటికి నిద్దురరాక కాఁకలనే పొద్దువోక వొంటి నేఁ బానుపున రేయుంటి నింత చాలదా | ॥తన్ను॥ |
| అప్పటి దగ్గరి నే రానై తినట చూడవే కొప్పు జారి సిగ్గుతోడఁ గొంకితి నేమో చిప్పల రెప్పల జంకించితినట చూడవే చెప్పరాని మాట నీతో జెప్పుటింత చాలదా | ॥తన్ను॥ |
| ఊరకే మాటాడక నే నుంటినట చూడవే ఆరడి పరవశాన నైతినో యేమో గోరికొనఁ దనుఁ దక్క గొంటినట చూడవే యేర వేంకటేశ నాతోనింత నీకుఁ జాలదా | ॥తన్ను॥ |


