శృంగార సంకీర్తన
రేకు: 7-4
సంపుటము: 5-41
రేకు: 7-4
సంపుటము: 5-41
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఎన్నడును గోపగించ విందుముఖి నీవిట్లా విన్నని వదనమెల్లా వింతలాయ నిపుడు | ॥పల్లవి॥ |
| ఇంతలోని పనికిఁగా నెంత చేసినాఁడవు కాంత నిన్నటినుండి కనుమూయదాయను బంతికూటి సతులెల్లా బలుమారు నేఁపగా చింతతోఁ బళ్ళెము మీఁద జెయి చాఁచదాయెను | ॥ఎన్న॥ |
| ఏమిసేయఁబోయి నీవుయేమి సేసినాఁడవు సాముకు విచ్చేయదు జవరాలు నేఁడు దోమతెర మంచముపై తురుము వీడఁగను తామసించి లేవదిదె తల నొచ్చీననుచు | ॥ఎన్న॥ |
| ఎవ్వరిని దూరవచ్చు నెవ్వరున్నారిఁకను పువ్వు సజ్జమీఁదఁ గాఁగె పొలఁతికి దేహము రవ్వగ వేంకటగిరి రమణ నీ కౌఁగిటఁ బవ్వళించి యింతలోనె పరవశమందెను | ॥ఎన్న॥ |


