Display:
శృంగార సంకీర్తన
రేకు: 7-5
సంపుటము: 5-42
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
మతికంటె వెలినున్న మంట (మాట?) మేలు
చతురులౌటకంటె జడులౌట మేలు
॥పల్లవి॥
ఇంటిలోననె వుండి హీతవరులై యుండు-
కంటెఁ బగయై యుండు కసరు మేలు
అంటుకొని మరుఁడొంటి అతివనేఁ పుటకంటె
పుంటినొవ్వల విరుల పోట్లె మేలు
॥మతి॥
తల్లివలె దానుండి తాపమవుటకంటె
అల్లంతనుండి కీడౌట మేలు
వెల్లిగొని నిటపర్పు వేడి చల్లెడికంటె
పల్లదపు చలిగాలి బాదలే మేలు
॥మతి॥
అలయించి దొరకెడి అమృతపానముకంటె
అలమి పైకొనెడి చేఁదైన మేలు
కలయక కలయు వేంకటశై లపతికంటె
తలపోఁత వేదనల తమకమే మేలు
॥మతి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము