శృంగార సంకీర్తన
రేకు: 7-6
సంపుటము: 5-43
రేకు: 7-6
సంపుటము: 5-43
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| అప్పుడే నే నీకు మోహపుటాలనైతినా కప్పకు నీ చేఁత లంతకంటెఁ బో నేను | ॥పల్లవి॥ |
| ఇంచుకంత పనికైన నిల్లుచొరనీక నిన్ను లంచములడుగను నే లకిమమ్మనా వంచనల నీకు నిట్టె వలలఁ జిక్కితిఁ గాక కంచుఁ బదనునకంత కంటెఁబో నేను | ॥అప్పుడే॥ |
| సొలపు మాటల నిట్టే చూపులనె జంకించి చలము సాదించ నీ సత్యభామనా వలచి నేనిదె నీకు వసమై చిక్కితిఁగాక కలికి చేఁతలనంత కంటెఁబో నేను | ॥అప్పుడే॥ |
| రేపు మాపు గోరఁ దమ్మి రేకులనే లేఖవ్రాసి రూపు నీకు జెప్పిపంప రుకిమిణినా తీపుల నిన్నుఁ గూడి తిరువేంకటేశ విరిఁ గైపు సేయఁగాని అంతకంటెఁబో నేను | ॥అప్పుడే॥ |


