శృంగార సంకీర్తన
రేకు: 8-3
సంపుటము: 5-46
రేకు: 8-3
సంపుటము: 5-46
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంభోది
| ఎప్పుడు గాని రాఁడో యెంత దడవాయ కాలిఁ- చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా | ॥పల్లవి॥ |
| ఇద్దరమదరిపాటు యేకాంతాన నాడుకొన్న- సుద్దులు దలఁచిమేను చురుకనెనమ్మా పెద్దగాఁ గస్తూరిబొట్టు పెట్టిన నాతఁడు గోర తిద్దుట దలఁచి మేను దిగులనెనమ్మా | ॥ఎప్పుడు॥ |
| పాయక యాతఁడూ నేనుఁ బవ్వళించే యింటివంకఁ బోయి పోయి కడుఁ జిన్న బోతి నోయమ్మా తోయపు గుబ్బల చన్నుదోయి మీఁద వాఁడొ త్తిన- పాయపు జంద్రుల జూచి భ్రమసితినమ్మా | ॥ఎప్పుడు॥ |
| కూడిన సౌఖ్యములందు కొదలేని వాని నా- వేడుక మతి దలఁచి వెరగాయ నమ్మా యీడులేని తిరువేంకటేశుఁడిదె నాతోడ నాడినట్టే నాచిత్తమలరించె నమ్మా | ॥ఎప్పుడు॥ |


