శృంగార సంకీర్తన
రేకు: 8-6
సంపుటము: 5-49
రేకు: 8-6
సంపుటము: 5-49
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఓ యమ్మా వినరో యమ్మా మాయలాడి మానిని | ॥పల్లవి॥ |
| ఈ యింతికి విభుఁడిచ్చినా చన- వేయెడాఁ బోవదిదిగదే రాయంచ నడపుల రాజసమ్మున పాయంపు రమణునిఁ బాయదు | ॥ఓయ॥ |
| సారె సటములు సందడింపుచు జారీఁ బయ్యెద సరుగనా దరి రమణునిఁ దొలఁకుఁ గన్నుల నీరు నించదు నిలువరే | ॥ఓయ॥ |
| అంకించి పిలిచినప్పుడా తిరు- వేంకటేశ్వరు వెరవున బొంకు లేని యట్టి పొందు చేకొని పంకజానన పైకొనే | ॥ఓయ॥ |


