శృంగార సంకీర్తన
రేకు: 9-1
సంపుటము: 5-50
రేకు: 9-1
సంపుటము: 5-50
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| వద్దు నీకు నా తోడి వట్టిమాటలు ముద్దులు నీపైఁ గునిసి మురిసీఁబో యిఁకను | ॥పల్లవి॥ |
| ఈడ వచ్చి ప్రియము నాకేమి చెప్పేవిందాఁకాఁ గూడినాకెకే ప్రియము గులుకరాదా వాడిక నిందాఁక నీవు వచ్చిన నేరమికి సూడుఁ బాడుఁ జెనకీఁ బో సొలపుఁ జేఁతలనే | ॥వద్దు॥ |
| ఎదిరి నావంకఁ దప్పకేమి చూచేవిఁక నీ- ముదితపైనే చూపులు ముంచరాదా మెదలి నా ముంగిలిది మెట్టిన తప్పునకును సద చేసి జగడాలు చల్లెడిఁబో యిఁకను | ॥వద్దు॥ |
| ఇట్టు నట్టుఁ జెఱఁగు నాకేల పట్టేవిదె మున్ను పెట్టినాకెకే చెఱఁగు పట్టరాదా వెట్టికూటములు చాలు వేంకటేశ యిదె నిన్ను బెట్టుగాఁగా నలుకలఁ బెట్టుఁగదా యిఁకను | ॥వద్దు॥ |


