శృంగార సంకీర్తన
రేకు: 9-3
సంపుటము: 5-52
రేకు: 9-3
సంపుటము: 5-52
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| వెరతుమయ్య చూపు వేఁటకాడ తరితీపు సేసి మమ్మింతటనె యేఁచేవు | ॥పల్లవి॥ |
| ఉంటవింటఁ గప్పురాన నుబ్బి నన్ను నేసేవు యింటి వారెవ్వరుంటా యెరఁగవు కంటిమి నీ యదలింపు కరఁగి నేఁబై కొన్న వెంట వెంటఁ దిరిగాడి వెతలఁ బెట్టేవు | ॥వెరతు॥ |
| పేలరివై యేడనైనాఁ బేరుకొని పిలిచేవు యేలిన వారెవ్వరంటా నెఱఁగవు తాలిమి మీరఁగ నీ చిత్తములో మెలఁగఁగ కాలూఁదనియ్యక యింత కాఁకలఁ బెట్టేవు | ॥వెరతు॥ |
| కొప్పులోని విరులు చెక్కుల జారఁ జెనకేవు యెప్పుడైనా నెవ్వరుంటా నెఱఁగవు కప్పకుర చెఱఁగు వేంకటరాయ చెమటలఁ దొప్పఁదోఁగి యెవ్వతో పొందులకు నేఁగితివి | ॥వెరతు॥ |


