శృంగార సంకీర్తన
రేకు: 11-3
సంపుటము: 5-64
రేకు: 11-3
సంపుటము: 5-64
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు అలవు మీఱిన దెట్లనమ్మా | ॥పల్లవి॥ |
| ఎలయింపుఁ గడకంట నెన్నఁడో వొకనాఁడు చెలఁగి తను నతఁడు చూచినవాఁడట పొలిఁతి యదిదలఁచి యిప్పుడు మదనవేదనల- నలసీ నిఁకనెట్లనమ్మా | ॥కలగన్న॥ |
| ఎఱుకయును మఱపుగా నేఁటికో వొకనాఁడు కెఱలి తను నొవ్వఁ బలికినవాఁడట తఱినదియె చెలి యిపుడు దలఁచి పరితాపాగ్ని- నఱగీ నిఁకనెట్లనమ్మా | ॥కలగన్న॥ |
| ఇయ్యకోలుగఁ గలసి యెప్పుడో యిదెనేఁడు నెయ్యమున చెలిలోన నెలకొనెనట తియ్యముల సటకాఁడు తిరువేంకటేశ్వరుఁడు అయ్యో యిఁకనెట్లనమ్మా | ॥కలగన్న॥ |


