శృంగార సంకీర్తన
రేకు: 11-4
సంపుటము: 5-65
రేకు: 11-4
సంపుటము: 5-65
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంభోది
| పొందెఱుఁగుదునందువు భోగినందువు నీ- యందరు సతులకు నేనాకు మడిచిత్తునా | ॥పల్లవి॥ |
| ఎవ్వతెకైనాఁ జనవిచ్చేవు మెచ్చేవు నీ- నవ్వులకైనాను మన్ననఁ జూచేవు అవ్వలి యివ్వలి నీ యంగనల వొద్దను పవ్వళించి వుండఁగా నే బాదములొత్తుదునా | ॥పొందె॥ |
| ఏపున నెక్కడికైనా నేఁగేవు దాఁగేవు నీ- కోపాన నాతోనైన మేకులు సేసేవు వైపున నీవెందుండైనా వచ్చిన నేనంతలో- నోపికనప్పుడు నీ కూడిగాలు సేతునా | ॥పొందె॥ |
| వేడుకలెందైనాఁ బారవేసేవు నీ- వాడికచేఁతలెన్నైనా వన్నె వెట్టేవు ఈడు లేని తిరువేంకటేశ కూడితివి నన్ను వాడుచు నీ తోడ నేను వాసి చూపఁగలనా | ॥పొందె॥ |


