శృంగార సంకీర్తన
రేకు: 12-3
సంపుటము: 5-70
రేకు: 12-3
సంపుటము: 5-70
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| తరుణి నీ యలుక కెంతటిదింతినీ వేళఁ గరుణించఁ గదర వేంకటశైలనాథా | ॥పల్లవి॥ |
| ఒకమారు సంసారమొల్లఁ బొమ్మని తలఁచు ఒకమారు విధిసేఁతలూహించి పొగడు ఒకమారు తనుఁజూచి వూరకే తలవూఁచు- నొకమారు హర్షమున నొంది మే మఱచు | ॥తరుణి॥ |
| నిన్నుఁ జూచి వొకమారు నిలువెల్లఁ బులకించు తన్నుఁ జూచి వొకమారు తలపోసి నగును కన్ను దెరచి నినుఁజూచి కడు సిగ్గువడి నిలిచి యిన్నియునుఁ దలపోసి యింతలో మఱచు | ॥తరుణి॥ |
| వదలైన మొలనూలు గడియించు నొకమారు చెదరిన కురులెల్లఁ జెరుగునొకమారు అదనెరిఁగి తిరువేంకటాదీశ పొందితివి చదురుఁడవు నినుఁ బాయఁజాలదొక మారు | ॥తరుణి॥ |


