శృంగార సంకీర్తన
రేకు: 12-4
సంపుటము: 5-71
రేకు: 12-4
సంపుటము: 5-71
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| మోహము సేయించుకొని మురిసేవు నీ- సాహసములె దురా చదురాలికిపుడు | ॥పల్లవి॥ |
| ఒక్క చక్రమె నీకునున్నది గాని, యింతిఁ రెక్కల చక్రాలె పో రెండు గుబ్బలు మక్కువ సేయించుకొని మలసేవు నీ- చక్కఁదనమెదురా జవరాలికిపుడు | ॥మోహ॥ |
| నీలమేఘము చాయ నీమేను గాని పెద్ద- నీలమేఘమే పో నెలఁత కొప్పు జాలిఁ బొరలించేవు సతిని నీవు నీ- తాలిములెదురా తరుణికి విపుడు | ॥మోహ॥ |
| మరుని ప్రతినిధి నీ మహిమ గాని ఆ- మరుని సంపదే పో మగువ నేఁడు తిరువేంకటేశ పొందితివి గాని నీ- సరసము లెదురా సకియకు నిపుడు | ॥మోహ॥ |


