శృంగార సంకీర్తన
రేకు: 13-2
సంపుటము: 5-75
రేకు: 13-2
సంపుటము: 5-75
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| పొదలు నీ సొబగెల్ల పోదేల కొల్ల తుదలేని నీ మేలు దొరకెఁగా నాకు | ॥పల్లవి॥ |
| ఒడలిపై నీచెమట వూరు వాడెడు చెలమ జడియు నీ తమకంబు సంత తగరు కడగంటి నీచూపు కట్ట వదలిన క్రేపు వడి నిన్నుఁ గరఁగింప వశమా నాకు | ॥పొదలు॥ |
| చిఱునవ్వు నీపలుకు జిగురు చుట్టిన కండె తెఱవలకు నీ మోవి తెరువు పెసరు పఱచు నీనునుఁజేఁత బట్టబాయిటి యీఁత తఱి నిన్నుఁ బైకొనఁగ దరమా నాకు | ॥పొదలు॥ |
| చెలువంపు నీ చెలిమి చెఱకు వండిన పండు కెలపు నీ యలుక తంగేటి జున్ను చలివాపు నీచనవు జాజులుఁ ప్రాసాదంబు కలిగె నీకరుణ వేంకట విభుఁడ నాకు | ॥పొదలు॥ |


