శృంగార సంకీర్తన
రేకు: 13-3
సంపుటము: 5-76
రేకు: 13-3
సంపుటము: 5-76
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| మచ్చికల మొగసిరి మందులాఁడ నీ- కిచ్చిన దేహమిది యెట్టయినఁ జేయరా | ॥పల్లవి॥ |
| ఓడక యెక్కడనైన నుండి నీవు వేడుకతో మాయింటికి విచ్చేయఁగాను వాడుమోముఁ జూచి నవ్వువచ్చుఁ గాని కోప- మేడఁ దెచ్చుకొన్నరాదు యెట్టైనాఁ జేయరా | ॥మచ్చి॥ |
| ఎంతవొద్దు వోయియైనా యిటునీవు వింతలేక మాయింటికి విచ్చేయఁగాను చింతతో నీ కెదురు చూచితి గాని యెంతైనాఁ బాయలేను యెట్టయినాఁ జేయరా | ॥మచ్చి॥ |
| కుంకుమచెక్కుల మెఱుఁగులతోడ తిరు- వేంకటేశ మాయింటికి విచ్చేయఁగాను వంకటాడి నినుఁ గూడవలెఁగాని యింక నిన్నుఁ బాయలేను యెట్టయినాఁ జేయరా | ॥మచ్చి॥ |


