శృంగార సంకీర్తన
రేకు: 13-4
సంపుటము: 5-77
రేకు: 13-4
సంపుటము: 5-77
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| వలపు నిలుపలేనివారము నేమటుగాన పలుమారుఁ బట్టుకొన్నఁ బయికొనవేలరా | ॥పల్లవి॥ |
| ఒత్తి నీవాడినమాటకోరువఁ జాలక నే- ముత్తరమిత్తము గాని ఊరకుండలేమురా బత్తి గొట్టానఁ బెట్టఁగఁ బనిలేదు వోరి నీ- చిత్తమింతేకాని యిఁక జెప్పనేమున్నదిరా | ॥వలపు॥ |
| కాఁకఁల బెరిగినట్టి కళవళమున నిన్నుఁ దాఁకనాడుదుము గాని తడవుండలేమురా యేఁకటఁ జెందినయట్టి యింతుల మాటకు నీవు సోఁకోరువవలెఁ గాక చురుకనరాదురా | ॥వలపు॥ |
| సారెకు నీవెడసిన సైఁచలేము నీవు చేరువనలిగి మమ్ముఁ జేకొనవేరా ధీరుఁడవు కోనేటితిరువేంకటేశ నన్ను గారవించి యిట్లానే కరుణించఁ గదరా | ॥వలపు॥ |


