శృంగార సంకీర్తన
రేకు: 16-5
సంపుటము: 5-94
రేకు: 16-5
సంపుటము: 5-94
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| గోళ్ళు మీఁటుచునుండెఁ గొన్నాళ్ళు గొల్ల- వీళ్ళ పాలారగించె వీఁడు కొన్నాళ్ళు | ॥పల్లవి॥ |
| కోడెకాఁడై తిరిగెఁ గొన్నాళ్ళు తాఁ గోడెల నావుల- గాచెఁ గొన్నాళ్ళు కోడెల వల్లెతాడై గొల్లెతలా తాఁ గూడి పైకొననుండెఁ గోరి కొన్నాళ్ళు | ॥గోళ్ళు॥ |
| గుజ్జు రూపము ధరించెఁ గొన్నాళ్ళు గుజ్జనగూళ్ళారగించెఁ గొన్నాళ్ళు గుజ్జుబాలకిఁ దగిలెఁ గొన్నాళ్ళు తా బొజ్జెనె లోకము నించె పొందుగఁ గొన్నాళ్ళు | ॥గోళ్ళు॥ |
| కొండ గొడుగుగాఁ బట్టెఁ గొన్నాళ్ళు తాఁ గొండముచ్చుల నేలెఁ గొన్నాళ్ళు కొండల కోనేటివాఁడై కోరికలా తాఁ గొండుక చేఁతలు దొంకొనియెఁ గొన్నాళ్ళు | ॥గోళ్ళు॥ |


