శృంగార సంకీర్తన
రేకు: 16-6
సంపుటము: 5-95
రేకు: 16-6
సంపుటము: 5-95
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| దొరకెఁగా పూజ కందువపూజ నీ- విరహపు తనుతావి విరవాదిపూజ | ॥పల్లవి॥ |
| కలికి నీ కనుచూపు కలువరేకులపూజ లలన నీ నగవు మొల్లల పూజ తలపోఁత చింత చిత్తపుఁ గమలపు పూజ చలివేఁడి వూర్పు నీ సంపంగి పూజ | ॥దొరకె॥ |
| కవలుఁ జెక్కునఁ జేయి కరపల్లవపు పూజ తనుపులకలు జాజిననలపూజ తనరు నీవలులు దొంతరపూవుల పూజ మొనయుఁ జెమట మల్లె మొగ్గలపూజ | ॥దొరకె॥ |
| చెనకు నీ గోళ్ళే చిఱుగేదఁగుల పూజ గునియు గుబ్బలు పూవుగుత్తుల పూజ ఘనతమైఁ గూడి వేంకటపతి మోము సోఁ- కిన నీదుమోవి మంకెనపూవు పూజ | ॥దొరకె॥ |


