శృంగార సంకీర్తన
రేకు: 17-1
సంపుటము: 5-96
రేకు: 17-1
సంపుటము: 5-96
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| పసులు గాచేటి కోల పసపుఁ జేల పొసఁగ నీకింతయేల బుద్ధుల గోల | ॥పల్లవి॥ |
| కట్టిన చిక్కపు బుత్తి కచ్చకాయల తిత్తి చుట్టిన పించెపుఁ బాగ చుంగుల సోగ ఇట్టి సింగారము సేయ నింత నీకుఁ బ్రియమాయ వెట్ట నీచేఁతల మాయ విట్టలరాయ | ॥పలు॥ |
| పేయలఁ బిలుచుకూఁత పిల్లఁగోవి బలుమోఁత సేయరాని గొల్లెతల సిగ్గులచేఁత ఆయెడలఁ దలపోఁత యమున లోపలి యీఁత వేయరాని మోపులాయ విట్టలరాయ | ॥పలు॥ |
| కొంకులేని పొలయాట కూరిములలో తేట అంకెల బాలులతోడి యాట పాట పొంకపు తుత్తురు కొమ్ము పొలుపైన నీ సొమ్ము వేంకటనగము చాయ విట్టలరాయ | ॥పలు॥ |


