శృంగార సంకీర్తన
రేకు: 18-5
సంపుటము: 5-106
రేకు: 18-5
సంపుటము: 5-106
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| అప్పటిని చెక్కు నొక్కే వందుకా యిది యెప్పుడో కూడితిరి మీరిందుకా యిది | ॥పల్లవి॥ |
| కుందనపు బొమ్మవలెఁ గోపగించుకొని రాఁగా- నందలానఁ బెట్టుకొంటివందుకా యిది జందెపు ముత్తెపుఁ బేరు సందులదండల నిట్టే యిందమంటానింతికిచ్చితిందుకా యిది | ॥అప్ప॥ |
| దీకొని కోమలి నిన్నుఁ దిట్టుచు దగ్గరి రాఁగా ఆకు మడిచియ్యఁ జూచేవందుకా యిది మీకు మీకే మందటాడి మీరు మీరేమీలోన యేకమై కూడితిరి మీరిందుకా యిది | ॥అప్ప॥ |
| ముద్దులమోముల మీ మీ మోవులపై చేఁతలెల్ల నద్దములోపలఁ జూచేరందుకా యిది తిద్దుకొంటిరి రతులు తిరువేంకటేశ మీ- యిద్దరికి నింపులాయ నిందుకా యిది | ॥అప్ప॥ |


