శృంగార సంకీర్తన
రేకు: 18-6
సంపుటము: 5-107
రేకు: 18-6
సంపుటము: 5-107
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| చక్కని తల్లికి చాఁగుబళా తన- చక్కెరమోవికి చాఁగుబళా | ॥పల్లవి॥ |
| కులికేటి మురిపెపు గుమ్మరింపుఁ దన- సళుపుఁ జూపులకు చాఁగుబళా పలుకుల సొలపులఁ బతితోఁ గసరెడి- చలముల యలుకకు చాఁగుబళా | ॥చక్కని॥ |
| కిన్నెరతోఁ బతి కెలన నిలుచుఁ దన- చన్ను మెఱఁగులకు చాఁగుబళా ఉన్నతిఁ బతిపైనొరగి నిలుచుఁ దన- సన్నపు నడిమికి చాఁగుబళా | ॥చక్కని॥ |
| జందెపు ముత్యపు సరులహారముల - చందనగంధికి చాఁగుబళా విందయి వేంకటవిభుఁ బెనఁచిన తన- సందిదండలకు చాఁగుబళా | ॥చక్కని॥ |


