శృంగార సంకీర్తన
రేకు: 20-4
సంపుటము: 5-111
రేకు: 20-4
సంపుటము: 5-111
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఆఁపలేక నిను దూరేనంతె గాక యేఁపుచుఁ గూడేటి పొందులేలయ్య విభుఁడా | ॥పల్లవి॥ |
| కోపగించుకొన్నచోట కూరిమితో వినయమే చూపిన నామాట నీకు సొగసీనటే యేపు రేఁగి నీకుఁ బ్రియమెక్కడనో వుండఁగాను తాపమయ్యే పొందు నీకుఁ దగదయ్య విభుఁడా | ॥ఆఁప॥ |
| నేరములెన్నఁగ నేను నిజములు పలికిన వైరములే యౌఁగాక వలపౌనటే యీరుదీయఁ బేను వచ్చీనిఁకనేల మాటలు నీ- వారము మమ్మిఁకఁ దడవకుమయ్య విభుఁడా | ॥ఆఁప॥ |
| ననిచి కూడినవారు నమ్మక ప్రియునిమీఁద కనలి యాడినమాట కసరౌనటే ఘనుఁడవు తిరువేంకటరాయ మనలోని- కినుకలన్నియు నిట్టె గెలుపయ్య విభుఁడా | ॥ఆఁప॥ |


