శృంగార సంకీర్తన
రేకు: 20-6
సంపుటము: 5-113
రేకు: 20-6
సంపుటము: 5-113
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
| ఏమి సేయుదునమ్మ యిన్నియును నిటుగూడె తామసపుఁ బ్రేమ వేదనఁ బాయనీదు | ॥పల్లవి॥ |
| కినిసి నే పొలసి పలికెద నంటినా యతని- నెనయుదఁడఁబాటు నోరెత్తనీదు చెనకి యలపార జూచెద నంటినా యతని- కనుఁగవ జలంబు సరుగనఁ జూడనీదు | ॥ఏమి॥ |
| కిందుపడి కదిసి మ్రొక్కెద నంటినా యతని- యంది పరవశము చేయాడ నీదు డెందంబు మఱచి యుండెద నంటినా యతనిఁ జెందిన తలఁపు మఱచియు మఱవనీదు | ॥ఏమి॥ |
| తిరువేంకటేశుఁ బొందితినంటినా యతని- దొరతనము నాగరిమ దోఁచనీదు సిరిదొలఁకు రతుల నలసితి నంటినా యతని- సరసంబు వేడుకలఁ జాలించనీదు | ॥ఏమి॥ |


