శృంగార సంకీర్తన
రేకు: 21-6
సంపుటము: 5-119
రేకు: 21-6
సంపుటము: 5-119
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఏలే దగ్గర నియ్యవిట్టె నన్ను తూలపుచ్చి మరుబారిఁ దోయ దొరకొంటివి | ॥పల్లవి॥ |
| కాలు దాఁకీ మొక్కేమయ్యా గబ్బిననేవు గనక యేల దగ్గర విచ్చేసేవిట్టె నన్ను వాలుఁగన్నుల రెప్పలు వంచి వంచి మొక్కేవు చాలదటే నన్ను నిట్టె చంపనెత్తుకొంటివి | ॥ఏలే॥ |
| తమ్మరసము వడీని తలవయ్య నీ మీఁద యెమ్మెలకడ్డము వచ్చేవు యేఁటికే నీవు వమ్ముదొలి మాటలనె వాఁడివసులనె నన్ను కుమ్ముచుఁ బ్రాణమునిట్టె కొనదొరకొంటివి | ॥ఏలే॥ |
| గుబ్బలచెమట దాఁకీఁ గోపగించేవు గనక ఆబ్బురంపుఁ దిరువేంకటాధీశుఁడా జొబ్బిలు నా చెమటల సోనల నించక యట్టే జొబ్బలుగా నామేనెల్లాఁ బొక్కించ దొరకొంటివి | ॥ఏలే॥ |


